నల్లచెరువు మండలంలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం జరిగింది. ఆలయం ఆవరణలో భజన మండలి సభ్యులు చేపట్టిన భజన కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన భాస్కర్‌రెడ్డి, ఆలయ ఈఓ షరీఫ్, కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa