ప్రజాగళం సభ చరిత్రలో పది కాలాలపాటు నిలిచిపోతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆ స్థాయికి తగిన రీతిలోనే సభ ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం బొప్పూడి వద్ద జరగనున్న సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు ఆలపాటి రాజా, బీద రవిచంద్ర, దామచర్ల సత్య, కిలారు రాజేశ్ తదితరులతో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. ఈ సభకు 10 లక్షల మందికిపైగా మూడు పార్టీల శ్రేణులు తరలివస్తారని అంచనా వేసినట్టు చెప్పారు.