స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో నాలుగు ‘ఎం’లు సవాళ్లుగా నిలిచాయని ప్రధాన కమిషనర్ చెప్పారు. డబ్బు(మనీ), కండబలం(మజిల్), తప్పుడు సమాచారం(మి్‌సఇన్ఫర్మేషన్), ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్) ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించనున్నట్లు చెప్పారు.రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ప్రచారంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీపై గట్టి నిఘా ఉంటుందని చెప్పారు. కుల, మత పరమైన విజ్ఞప్తులు కుదరవని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయరాదన్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు దూరంగా ఉండాలని చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ల మీద కూడా మర్యాద బాధ్యత పెడుతున్నామని ప్రకటించారు. స్వేచ్చగా, సజావుగా ఎన్నిక లు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మతపరంగా, కుల పరంగా ప్రచారాన్ని, విద్వేష ప్రసంగాల్ని ఉపేక్షించబోమని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. 18 ఏళ్లు దాటిన 1.8 కోట్ల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారని, వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండే వారికి కూడా అవకాశం ఇచ్చామన్నారు. నో యువర్ కాండిడేట్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చామని, ప్రతి ఓటరూ తన అభ్యర్థి నేర చరిత, విద్యార్హతలు, ఆస్తుల గురించి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.