సార్వత్రిక సమరానికి భేరీ మోగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పర్వానికి తెరలేచింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్య ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మోదీ ‘ఎన్డీయే’ హ్యాట్రిక్ కొడుతుందా? రాహుల్ ‘ఇండియా’ గెలుస్తుందా? జూన్ 4వ తేదీ వెలువడే ఫలితాలతో తేలిపోతుంది.