ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరి కోసం 301 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరక పేపర్-2 పరీక్ష జరగనుంది. గ్రూపు-1 పరీక్షలు ( Group-1 Exams ) జరిగే కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులను నియమించారు. పరీక్షల పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌ఛార్జ్‌గా అపాయింట్ చేశారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును ఏపీపీఎస్సీ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. పరీక్ష అనంతరం ఆన్సర్ సీట్లు ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa