ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణ బద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట. ప్రజాగళం పేరిట నిర్వహించనున్న ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో జరిగే సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ఈ సభ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa