రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 22 చోట్ల ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అవి... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, కేరళ, లక్షద్వీప్, లద్దాఖ్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. క ర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు దశల్లో, ఛత్తీ్‌సగఢ్, అసోంలలో మూడు దశల్లో, ఒడిసా, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో నాలుగు దశల్లో, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్ లలో అయిదు దశల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశ ల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఒడిసా శాసనసభ ఎన్నికలు మే 13, 20, 25, జూన్ 1వ తేదీల్లో నాలుగు దశల్లో జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి.