ఈ సారి ఎన్నికలకు 97.89 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారని ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. వారిలో 47.1 కోట్ల మంది మహిళలు ఉన్నారన్నారు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. 48 వేల మంది ట్రాన్స్‌జెండర్లుగా ఓటు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్(2 స్థానాలకు), అసోం(5), బిహార్(4), ఛత్తీ్‌సగఢ్(1), మధ్యప్రదేశ్(6), మహారాష్ట్ర(5), మణిపూర్(2), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్(1), రాజస్థాన్(12), సిక్కిం(1), తమిళనాడు(39), త్రిపుర(1), ఉత్తరప్రదేశ్(8), ఉత్తరాఖండ్(5), పశ్చిమ బెంగాల్ (3), అండమాన్ నికోబార్(1), జమ్మూకశ్మీర్(1), లక్ష్యద్వీప్(1), పుదుచ్చేరి(1) ఉన్నాయి.రెండో దశలో దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇందులో అసోం(5), బిహార్(5), చత్తీ్‌సగఢ్(3), కర్ణాటక(14), కేరళ(20), మధ్యప్రదేశ్(7), మహారాష్ట్ర(8), మణిపూర్(1), రాజస్థాన్(13), త్రిపుర(1), ఉత్తరప్రదేశ్(8), పశ్చిమ బెంగాల్(3), జమ్మూకశ్మీర్(1) ఉన్నాయి.మూడో దశలో దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 స్థానాలకు మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఇందులో అసోం(4), బిహార్(5), చత్తీ్‌సగఢ్(7), గోవా(2), గుజరాత్(26), కర్ణాటక(14), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), యూపీ(10), పశ్చిమ బెంగాల్(4), దాద్రానగర్ హవేలి, దమన్ దీవ్(2), జమ్మూకశ్మీర్(1) ఉన్నాయి. నాలుగో దశలో దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్(25), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిసా(4), తెలంగాణ(17), యూపీ(13), బెంగాల్(8), జమ్మూకశ్మీర్(1) ఉన్నాయి.ఐదో దశలో దేశంలోని 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు మే 20న పోలింగ్ జరుగుతుంది. ఇందులో బిహార్(5), ఝార్ఖండ్(3), మహారాష్ట్ర(13), ఒడిసా(5), ఉత్తరప్రదేశ్(14), పశ్చిమ బెంగాల్(7), జమ్మూకశ్మీర్(1), లద్ధాఖ్(1) ఉన్నాయి.ఆరో దశలో దేశంలోని 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది. ఇందులో బిహార్(8), హరియాణా(10), ఝార్ఖండ్(4), ఒడిసా(6), ఉత్తరప్రదేశ్(14), పశ్చిమబెంగాల్(8), ఢిల్లీ(7) ఉన్నాయి.ఏడో దశలో దేశంలోని 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. బిహార్(8), హిమాచల్ ప్రదేశ్(4), ఝార్ఖండ్(3), ఒడిసా(6), పంజాబ్(13), ఉత్తరప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(9), చండీగఢ్(1) ఉన్నాయి.