‘‘విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల ఊపిరి. 32 మంది ప్రజల బలిదానంతో ఏర్పడిన ఈ కర్మాగారంతో ప్రజలకు భావోద్వోగ బంధం ఉంది అని కాంగ్రెస్ నేత షర్మిల అన్నారు. విశాఖ ఉక్కు అం టేనే ఒక ఎమోషనల్. ఒక సెంటిమెంట్. ఉక్కు కర్మాగా రం కోసం ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నాడు తెలంగాణలోని వరంగల్‌లో ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా 25 వేల మందితో సభ నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇందిరమ్మ నెలకొల్పితే పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారు. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉక్కు కర్మాగారం కోసం అనేక రకాలుగా సహాయపడడంతోపాటు సొంత గను ల కోసం ప్రయత్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు విశాఖ ఉక్కు లాభాల్లోనే ఉంది. అప్పుల పేరుతో ప్రైవేటీకరణకు తెరతీశారు. సొంత గనులు ఇవ్వడం లేదు. బొగ్గు ఇవ్వడం లేదు. ఇలా చేతులు, కాళ్లు నరికేసి మొండెం మిగిల్చారు’’ అని ఆగ్రహం వ్యక్తపరిచారు.