గెలిచే వ్యక్తికి టికె ట్ ఇవ్వాలన్నదే మా అభ్యర్థన ని, పార్టీకి ఎప్పుడూ తాము విధేయు లుగానే ఉంటామని శ్రీకాకుళం ని యోజకవర్గ టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక 80 అడుగుల రోడ్డులో గల జిల్లా పార్టీ కార్యాలయం లో వారు టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, డివిజ న్ ఇన్‌చార్జీలతో కలిసి విలేకరులతో మాట్లాడా రు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచీ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో మాజీ మంత్రి గుండ దంపతులు పనిచేస్తున్నార ని, నేటి రాజకీయాల్లో వారు నీతి, నిజాయితీకి చిరునామాగా నిలిచారన్నారు. ఎన్ని ఒడిదుడు కులు ఎదురైనా పార్టీకోసం వారు పనిచేశారని, అందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకున్నారన్నారు. మంత్రి ధర్మాన వంటి బలమైన నాయకుడిని ఓడించి పార్టీ జెండాను ఎగురవేయగలిగే సత్తా కలిగిన గుండ లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వాలని అభ్యర్థించడానికే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటికి వచ్చామే తప్ప, పార్టీ పట్ల, నాయకుల పట్ల వ్యతిరేకతకు చోటులేదని స్పష్టం చేశారు. అంతిమంగా పార్టీ గెలుపే లక్ష్యమని, క్రమ శిక్షణతో పనిచేస్తామని స్పష్టం చేశారు. అసమ్మతి పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదనే ఉద్దేశంతో గుండ లక్ష్మీదేవి రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి విన్నవించుకున్నారని, పరిస్థితులు చక్కబడాలనే ఉద్దేశమే తప్ప మరేమీ లేదన్నారు. అంతిమంగా పార్టీ ప్రయోజనాలు, గెలుపే ముఖ్యమని గుండ దంపతులు ఎప్పుడూ భావిస్తుంటారని, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం చేయలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జామి భీమ శంకరరావు, చిట్టి నాగభూషణరావు, కోరాడ రమేష్, కవ్వాడి సుశీల, కొమర కమల, రోణంకి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.