ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కస్టమర్లకు సడెన్ షాకిచ్చిన ఎస్‌బీఐ.. ఇక ఆ బెనిఫిట్స్ ఉండవ్.. కీలక మార్పులు ఇవే

national |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 11:16 PM

ఎస్‌బీఐ కార్డ్ జారీ చేసిన క్రెడిట్ కార్డుల్ని మీరు వాడుతున్నారా? తాజాగా ఈ క్రెడిట్ జారీ సంస్థ కీలక ప్రకటన చేసింది. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై రివార్డ్ పాయింట్లు ఉండవని స్పష్టం చేసింది. రివార్డ్ పాయింట్ల సేకరణ సర్వీసుల్ని కొన్ని క్రెడిట్ కార్డులకు నిలిపివేస్తున్నట్లు (డిస్‌కంటిన్యూ) వెల్లడించింది. ఇది కస్టమర్లకు షాకింగ్ విషయం అనే చెప్పాలి. తాజా నిర్ణయం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది ఎస్బీఐ కార్డ్. సదరు రివార్డ్ పాయింట్ల వినియోగం కూడా 2024, ఏప్రిల్ 15 న ముగుస్తుందని వెల్లడించింది.


రెంట్ పేమెంట్లపై రివార్డ్ పాయింట్లు వర్తించని ఎస్బీఐ క్రెడిట్ కార్డులివే..


ఆరమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్డ్ పల్స్, సింప్లీక్లిక్ ఎస్బీఐ కార్డ్, సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, ఎస్‌‌బీఐ కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్డ్ ప్లాటినం, ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రో, ఎస్బీఐ కార్డ్ శౌర్య సెలక్ట్, ఎస్బీఐ కార్డ్ ప్లాటినమ్ అడ్వాంటేజ్, డాక్టర్స్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ క్లాసిక్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ క్లాసిక్ ఎస్బీఐ కార్డ్, గోల్డ్ డిఫెన్స్ ఎస్‌బీఐ కార్డ్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇక ఏప్రిల్ 15 నుంచి వర్తించని వాటిలో ఎయిరిండియా ఎస్బీఐ ప్లాటినమ్ కార్డ్, ఎయిరిండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్, ఆదిత్యా బిర్లా ఎస్బీఐ కార్డ్ సెలక్ట్, బీపీసీఎల్ ఎస్బీఐ కార్డ్ ఆక్టేన్, క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్, ఐఆర్సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్, సెంట్రల్ ఎస్బీఐ కార్డ్ వంటివి ఉన్నాయి.


>> ఆన్‌లైన్ ద్వారా ప్రస్తుతం ఉన్న రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు.


దీని కోసం తొలుత sbicard.com వెబ్‌సైట్‌కు వెళ్లాలి.


అక్కడ మొదట రివార్డ్స్‌పై, తర్వాత రిడీమ్ రివార్ట్స్‌పై క్లిక్ చేయాలి.


రివార్డ్స్ కేటలాగ్‌ ద్వారా బ్రౌజ్ చేసి మీ ఐటమ్ ఛాయిస్ ఎంచుకోవాలి.


తర్వాత రిడీమ్ నౌ ‌పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి.


 ఇదే సమయంలో ఎస్బీఐ కార్డుకు సంబంధించి ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్, మినిమం డ్యూ అమౌంట్ కాలిక్యులేషన్‌లో మార్పులు చేసింది. ఇది మార్చి 15 నుంచే అమల్లోకి రాగా.. మరోవైపు అంతకుముందే పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డులో రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై క్యాష్‌బ్యాక్ ఎత్తివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com