తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె గ్రామానికి చెందిన జె. సి అభిమాని ఒంటెద్దు జయరామిరెడ్డి భార్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకుని ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయరామిరెడ్డి కుటుంబసభ్యులను జె. సి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.