జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి లేదు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవు. పరిశ్రమలే కాదు చివరికి సరైన రోడ్లు కూడా లేవు. పోలవరం ముందుకు సాగలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేసిన ఘనత దుర్మార్గపు ముఖ్యమంత్రికే దక్కింది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ద్వారా మంచి పాలన అందించేలా చేసుకుందాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రజలంతా కలిసి ఎన్నుకోవాలి అని నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అన్నారు.