నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు.ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది..అలాంటిది నన్ను ఓడించేందుకు వందల కోట్లు కుమ్మరిస్తున్నారట.. ఓటుకు రూ.10వేలు, కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.