తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం, అందులో పిల్లలకు పరీక్షల సమయం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు అన్ని ఖాళీగానే కనపడుతున్నాయి.దీనితో శ్రీవారి దర్శనం భక్తులకు అత్యంత సులువుగానే అవుతుంది. ఇక అలాగే టీటీడీ వసతి గృహాల విషయంలోనూ భక్తులకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. అలాగే తిరుమలలోను ఏ వీధిలో కూడా పెద్దగా రద్దీ కానపడం లేదు.ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం ఒక గంట సమయంలో పూర్తి అవుతుందని టీటీడీ దేవస్థానం అధికారులు తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవారిని 63,251 మంది భక్తులు దర్శించుకోగా అందులో.. 20,989 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు.ఇక బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం విషయానికి వస్తే.. రూ. 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో ఎక్కడ వేచి ఉండకుండానే స్వామి భక్తులు స్వామి వారిని నేరుగా దర్శించుకుంటున్నారు. ఇక సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మాత్రం 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది స్వామి వారి దర్శనం