స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంజూరుచేసిన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. హోలీ సెలవుల తర్వాత దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.