అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం భరోసాగా నిలిచిందని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అయన మాట్లాడుతూ.... వైయస్ జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ అందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించిన ఘనత జగన్ ది . తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమ పథకాలు అందించాం. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలి. సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ ,జనసేన పార్టీలు దోస్తీ కలిశాయి. మైనార్టీ లకు వ్యతిరేకంగా గా NRC ,CAA లను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికాడు. వైయస్ జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది. అణగారిన వర్గాలకు వైయస్ జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది అని అన్నారు.