వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధులను చేస్తూ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం వైయస్ జగన్ చేపట్టే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు ఇవాళ కర్నూలు నగరంలో నమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను మంత్రి ఆవిష్కరించారు.ఈ నెల 27వ తేదీన వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుందని తెలిపారు. 27న ఇడుపుల పాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద సీఎం వైయస్ జగన్ నివాళులర్పిస్తారని, అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి టూర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంతియాజ్, డాక్టర్ ఆదిమూలపు సతీష్, బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు.