శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీశైలం వస్తూ ఘాట్ రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. డీసీఎం వాహనంలోని వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల గ్రామం నుంచి డీసీఎం వాహనంలో శ్రీశైలం వస్తూ వాహనానికి బ్రేక్ ఫైల్ కావడంతో విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని డ్రైవర్ను వాహనంలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.