గుంతకల్లు పట్టణంలోని భీమిరెడ్డి కాలనీలో నివాసముంటున్న సుజాత అను మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును గురువారం గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు. బాధితురాలు వివరాలు మేరకు ఆలయానికి వెళుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెనుక నుంచి వచ్చి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.