హిందూపురం వ్యవసాయ మార్కెట్ చింతపండు కొనుగోళ్లతో కళకళలాడుతోంది. గురువారం ఈ సీజన్లోనే అత్యధికంగా 57. 70 టన్నుల చింతపండు రాగా, ఈ-నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి రకం క్వింటా గరిష్ఠంగా ₹24000, కనిష్ఠంగా ₹8000, సగటున ₹13వేల ప్రకారం పలికిందన్నారు. అలాగే ఫ్లవర్ రకం క్వింటా గరిష్ఠంగా ₹11000, కనిష్ఠంగా ₹4000, సగటున ₹6000 ప్రకారం క్రయవిక్రయాలు జరిగినట్లు తెలిపారు.