గుంతకల్లు మున్సిపాలకులు లక్షలు ప్రజాధనంతో 60 అడుగుల రోడ్డులో డివైడర్ల మధ్య మొక్కలు నాటి నీరు పోసి పెంచి విద్యుత్తు లైట్లకు అడ్డుగా ఉన్నాయని నరికేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఆహ్లాదం కోసం డివైడర్ల మధ్యలో మున్సిపల్ అధికారులు లక్షల ప్రజా ధనంతో మొక్కలు నాటి ట్యాంకర్లతో నీరు పోసి పెంచారు. ఐతే వృక్షాలుగా పెరిగిన వాటిని నరకడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.