గూడూరుకు తాగునీరు అందించే కండలేరు పైపులైను మల్లితోట వద్ద మరమ్మతులకు గురైంది. శుక్రవారం గూడూరు మున్సిపల్ కమిషనర్ అన్నవరం వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఈ పైపులైను పలుచోట్ల చెడిపోవడంతో గత నాలుగైదు రోజులుగా గూడూరు పట్టణానికి తాగునీరు అందడం లేదు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టామని, లీకులన్నీ అరెస్టు చేశామన్నారు. మంచినీరు పంపింగ్ చేస్తున్నామని, శనివారం యథావిధిగా మంచినీటి సరఫరా చేస్తామన్నారు.