కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో 'జనతా కర్ఫ్యూ' విధించింది. నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది.
ఆ తర్వాత క్రమంగా దాదాపు 2 నెలల పాటు లాక్డ్ డౌన్ కొనసాగింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది.