పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దుర్గి నుంచి మించాలపాడుకు కారులో వెళ్తున్న జనసేన నేతలను.. జంగమేశ్వరపాడు దగ్గర వైసీపీ నేతలు అడ్డగించి, దాడులు చేశారు.
ఈ దాడిలో జనసేన నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు జనసేన నేతలు దుర్గి పోలీసు స్టేషన్లో వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.