వేసవికాలంలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు నానా అవస్థలు పడుతూ ఉంటాము. ఈ క్రమంలో శరీరాన్ని చల్లబరిచేందుకు, నీటి శాతం సరిపడేలా ఉండేందుకు పండ్లు ఎక్కువ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రథమంగా పుచ్చకాయ ఎక్కువ తినాలని సూచిస్తున్నారు. అలాగే స్ట్రాబెర్రీ, నారింజ, పైనాపిల్, ద్రాక్ష వంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలని, శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కావాల్సిన పోషకాలు ఈ పండ్లు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.