ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. పాసన్ పోలీస్ స్టేషన్ పరిధి బైరా గ్రామంలో ఉమేంద్ర (27) అనే యువకుడు తన సోదరుడి కుటుంబంతో ఉంటున్నాడు.
సోదరుడి భార్య కళావతి (34)తో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం కళావతి భర్తకు తెలియదు. గ్రామంలోని ఓ చెట్టుకు ఉమేంద్ర, కళావతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.