ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా మరోసారి అధికారులకు కీలక సూచనలు చేశారు.
రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. జిల్లాల పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా పెంచాలన్నారు. 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సేవలు కల్పించినట్లు తెలిపారు.