మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 25న వేలం వేయనున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రత్యూష కంపెనీలోని తొమ్మిది రకాలైన ఆస్తులకు వేలం వేయనున్నారు. కాగా, ప్రత్యూష కంపెనీ బ్యాంక్ నుంచి రూ.248 కోట్లు రుణం తీసుకుంది.