దేశంలో నీటి కోరత తీవ్రమైంది. వర్షాలు పడకపోవడంతో 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా 38 శాతానికి పడిపోయాయి. దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు,
కేరళలో నిల్వలు అత్యల్పంగా 23 శాతానికి చేరాయి. 150 జలాశయాల నిల్వ సామర్థ్యం 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్లు(బీసీఎం) కాగా ప్రస్తుతం 67.591 బీసీఎం నీరు మాత్రమే ఉంది. వేసవి ముగిసే సమయానికి పరిస్థితి మరింత దిగజారే ఛాన్సుందని నిపుణులు చెబుతున్నారు.