విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు వెయ్యి బ్యాగుల్లో శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపింది. ఇది ప్రమాదకర నార్కోటిక్ డ్రగ్స్‌గా సీబీఐ ప్రాథమిక నిర్ధారణ వచ్చింది.
కేసులో భాగంగా సంధ్య ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్, వాట్సాప్ చాటింగ్‌పై ఆరా తీసింది. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీతో సీబీఐ సంప్రదింపులు జరిపింది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి విచారణ జరుపనున్నారు.