విశాఖను డ్రగ్స్ కేంద్రంగా మార్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయి టీడీపీపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొన్నాం కాబట్టి.. మళ్లీ అధికారంలోకి మేమే వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు 5కోట్లు ఆంధ్రుల కోసమేనని గుర్తించి.. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.