ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్టలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన సుబ్బారావు(47), ఆయన భార్య పద్మావతి(41),
కుమార్తె వినయ(17) అనే ముగ్గురు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు తమ మూడెకరాల పొలం వేరే వాళ్ళ పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేని స్థితిలో తాము చనిపోతున్నట్లు ఆ నోట్ లో రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.