ఓ పోలీసు అధికారిపై కోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ED అరెస్ట్ చేసి, శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది.
ఆ సమయంలో తనతో ఏసీపీ ఏకే సింగ్ అనుచితంగా ప్రవర్తించారని, ఆయనను తన భద్రతా విధుల నుంచి తొలగించాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు. గతంలో మనీష్ సిసోడియాను మెడ పట్టుకుని గెంటారనే ఆరోపణలు ఏకే సింగ్‌పై ఉన్నాయి.