ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం అగ్రస్థానంలో నిలవడం ఇది ఏడోసారి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా
మార్చి 20న యూఎన్ ఆధారిత సంస్థ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ (1), డెన్మార్క్ (2), ఐస్లాండ్ (3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి.