ఎన్నికల వేళ రాజకీయ నేతలపై కొందరు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తన పెళ్లి పత్రికపై ముద్రించారు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి కుమార్.
'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్రమోదీకి వేసే ఓటు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.