లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాలు జరుగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా దీనిపై స్పందించారు. కేంద్రం సదుద్దేశంతో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. విరాళాలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా నడవదని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa