ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్టు ఇండియా అలయన్స్ ప్రకటించింది. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ..
'ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు, నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, బీహార్‌లో తేజస్వీ యాదవ్‌పై కూడా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.