భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలను ఆదుకునేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంతువులు రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. పెళ్లి చేసుకుని ఆ సర్టిఫికెట్‌ని, చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్నీ సమర్పిస్తే- వారి ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తోంది. ఈ పత్రాలను పెళ్లైన ఏడాదిలోపే సమర్పించాల్సి ఉంటుంది. ఏ అండా లేనివారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.