ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరులో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ జరిగి 24 గంటలు గడవకుముందే మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం సుక్మా జిల్లా కొండపల్లిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో కొందరు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. చనిపోయిన మావోయిస్టు గంగలూరు ఏరియా కమిటీ సభ్యుడిగా భద్రతా దళాలు గుర్తించాయి.