గుంటూరు జిల్లా ఎస్పీ పైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఎస్పీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సకల శాఖల సజ్జల, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీల వాహనాలు పోలీసులకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. మంగళగిరి మొత్తం డ్రగ్స్ డెన్‌గా మారిందని ఆరోపించారు. పోలీసులకు ఇదేమీ కనిపించదా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ప్రమేయం, పోలీసుల సహకారం లేకుండా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు ఎలా దొరుకుతాయి? అని లోకేష్ ప్రశ్నించారు.