అమెరికాకు చెందిన దిగ్గజ విమానాల తయారీ సంస్థ 'బోయింగ్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సీఈఓ డేవ్ కాల్హౌన్ ఆదివారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది చివరి వరకు ఆయన సీఈవోగా వ్యవహరిస్తారు.ఆ తర్వాత ఆయన స్థానంలో స్టెఫానీ పోప్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు బోయింగ్ కంపెనీ ప్రకటించింది. బోయింగ్ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్న తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa