శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో డి. అమరనాథ్‌రెడ్డి(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన ఆయన.. ఆదివారం పగలంతా టీడీపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం, రాత్రి పొలం వద్దకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి గమనించారు. రక్తపు మడుగులో ఉండటంతో హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై అమరనాథ్‌రెడ్డి భార్య సుధమ్మ తమకు ఫిర్యాదు చేశారని ఎస్ఐ రమేశ్‌బాబు తెలిపారు.