ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో నరసింహులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకల్లు మండలంలోని రాసినేపల్లిలో శనివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు రాసినేని కమలాకర్ నాయుడు, మనోహర్, శ్రీహరి నాయుడు పాల్గొన్నారు. ఈసీ ఆదేశాలకు వ్యతిరేకంగా వాలంటీర్లు వ్యవహరించడంతో ఎంపీడీవో సస్పెండ్ చేశారు.