ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు ఉద్యోగ భద్రత టీడీపీతోనే సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 12:05 PM

తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ భద్రత ఉంటుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత తనయుడు గౌరు జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం 29వ వార్డు బాలజీనగర్‌, విజ్జీనగర్‌, రుక్మీణీనగర్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుని శంఖారావం సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ....  రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాల కల్పించగల సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబే అన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి పారిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయ లేయలేని జగన్‌ పేదలపై చార్జీలు, పన్నుల భారాన్ని వేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూలోటు, ప్రత్యేక రైల్వే జోన్‌, ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు, జాబ్‌క్యాలెండర్‌, మధ్య నియంత్రణ గాలికొదిలేసి, రాష్ట్రంలో మైన్‌, వైన్‌, ల్యాండ్‌, శాండ్‌, భూ ఆక్రమణలతో వైసీపీ నాయకులు చెలరేగి పోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి కె.శ్రీనివాసరావు, వీరేంద్ర, రామకృష్న, పుల్లయ్యగౌడ్‌, జనసేన నాయకుడు షబ్బీర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com