రంజాన్ మాసం సందర్భంగా కదిరిలో ముస్లిం మైనార్టీల కోసం ఏప్రిల్ 1న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్ కలిసి కదిరి-మదనపల్లి రోడ్ లోని పీవీఆర్ ఫంక్షన్ హాలును పరిశీలించారు.