పోలాకి మండలంలోని ప్రియాగ్రహారంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో బైరి జట్టు విజేతగా నిలిచింది. 25 జట్లు పాల్గొన్న ఈ పోటీల ఫైనల్ సోమవారం రాత్రి జరిగింది. విజేతగా బైరి జట్టు నిలిచింది. తృతీయ స్థానంలో జలుమూరు మండలం కొండపోలవలస నిలిచినట్లు యువజన సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు సర్పంచ్ బెవర నూకరాజు, ఎంపీటీసీ ప్రసాదరావు, మాజీ సర్పంచ్ లావేటికృష్ణ, వేదుల ఫణీంద్రశర్మ బహుమతులు అందచేశారు.