ఏప్రిల్ నెలకు సంబంధించి సామాజిక ఫించన్లను యాడికి మండల వ్యాప్తంగా 3వతేదీ నుండి పంపిణీ చేయనున్నట్లు ఎంపిడిఒ సావిత్రి తెలిపారు. మంగళవారం ఎంపిడిఒ సమావేశపు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఎన్నికల అధికారుల నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని నియమాలకు లోబడి ఆయా పార్టీలు వ్యవహరించాలన్నారు. సామాజిక ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపిడిఒ కోరారు.