బేస్తవారిపేట మండలం గలిజరగుళ్ల గ్రామంలో మంగళవారం సీఐ రామకోటయ్య, ఎస్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా ముగిసేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సిఐ రామకోటయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు శాంతియుతంగా ముగిసేందుకు సహకరించాలన్నారు.