గొడవను అడ్డుకున్న వృద్ధురాలిపై మందు బాబు దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటన కురబలకోట మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు. అంగళ్లు పంచాయతీ, చిన్న హరిజనవాడకు చెందిన నరసమ్మ (70) ఇంటి ముందు అదే ఊరిలోని ఇద్దరు మందు బాబులు గొడవపడుతుంటే వెళ్లి అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన ఓ మందు బాబు ఆమెపై దాడి చేశాడు. కాలు విరగడంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa